- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'సైమా' ఈవెంట్స్ డేట్ ఫిక్స్
దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల (సైమా - SIIMA) ప్రదానోత్సవ తేదీలు ఖరారయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : దక్షిణ భారత అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల (సైమా - SIIMA) ప్రదానోత్సవ తేదీలు ఖరారయ్యాయి. సైమా13వ ఎడిషన్ అవార్డుల(SIIMA Awards) ప్రదానోత్సవం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో దుబాయ్(Dubai) వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్ర పరిశ్రమలలోని కళాకారులు, సాంకేతిక నిపుణుల కృషిని గౌరవిస్తూ 2012 నుంచి ఈ అవార్డులు ఇస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు(సెప్టెంబర్ 5) "జనరేషన్ నెక్స్ట్ అవార్డ్స్" కింద డెబ్యూట్ నటీనటులను సత్కరిస్తారు. రెండవ రోజు (సెప్టెంబర్ 6) తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం చిత్రాలకు ఉత్తమ చిత్రం, నటుడు/నటి, దర్శకుడు, సంగీత దర్శకుడు, సాంకేతిక నిపుణులు, జీవన సాఫల్య పురస్కారాలు వంటి విభాగాలలో అవార్డులు ప్రదానం చేయబడతాయి. వీటికి సంబంధించిన నామినేషన్లు, జ్యూరీ ఎంపిక పబ్లిక్ ఓటింగ్ ద్వారా నిర్ణయించబడతాయి.






