- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడే ఓటీటీలోకి తెలుసు కదా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’.

దిశ, సినిమా: సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన ఈ చిత్రానికి నీరజ కోన దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ అక్టోబర్ 17 గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వచ్చి.. కేవలం మిక్సిడ్ టాక్‌కే పరిమితం అయింది. దీంతో ఈ సినిమాపై కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారంటూ చిత్ర బృందం కూడా మీడియా ముందు మాట్లాడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రిలీజైన 15 రోజులకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతున్నది. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ. 22 కోట్లకు దక్కించుకోగా.. ఈనెల 13న నుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.






