- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: జాక్ ఓటీటీ రిలీజ్ డేట్ మార్చుతూ కొత్త అప్‌డేట్ ఇచ్చిన నెటిఫ్లిక్స్
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack).

దిశ, సినిమా: సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack). ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నర్మించింది. ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చి కేవలం మిక్సిడ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే.. మొదట ఈ సినిమా స్టా్ర్టింగ్‌లో ‘జాక్’ మే 9కి రిలీజ్ చేద్దాం అని అనుకున్నారు. కానీ.. అనుకున్నదానికంటే ముందుగానే మే 1కి ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అయితే.. ఇప్పుడు కూడా మళ్లీ ఆ డేట్‌ను మార్చుతూ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు నెట్‌ఫ్లిక్స్ సంస్థ. ఈ మేరకు మే 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో జాక్‌ని నెట్‌ఫ్లిక్స్(Netflix)లో చూడండి అంటూ చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
Pablo Neruda, peru poetic ga unna profession maathram confidential 🤫🤭
— Netflix India South (@Netflix_INSouth) May 5, 2025
Watch Jack on Netflix, out 8 May in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam#JackOnNetflix #JackTheMovie pic.twitter.com/WeeWmAqY7B






