- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sidhu Jonnalagadda: క్లారిటీ ఉన్న క్రాక్ నా కొడుకు వస్తున్నాడు.. ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘తెలుసు కదా’ ఒకటి.

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘తెలుసు కదా’ ఒకటి. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు నీరజ కోన దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. వైవా హర్ష కీలక పాత్రలో కనిపించనున్నాడు. పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.
ఇప్పటికే వచ్చిన టీజర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించగా.. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ చిన్న ప్రోమోను రిలీజ్ చేస్తూ ట్రైలర్ అక్టోబర్ 12వ తేదీన రాబోతున్నట్లు తెలిపారు. ‘స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్‌తోటి జాగ్రత్త’ అనే వైవా హర్ష డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ప్రోమోలో.. ‘వాళ్లు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ అయితే మనం కూడా క్లారిటీ ఉన్న క్రాక్ నా కొడుకులం కదా’ అంటూ చెప్పే సిద్ధు డైలాగ్స్ హైలెట్‌గా నిలిచాయి. ప్రజెంట్ ఈ ప్రోమో వైరల్ అవుతుండగా.. ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






