కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన సిద్ధు.. ఫాంటసీ ఎంటర్‌టైనర్ స్టార్ట్

by Chukka Sudharani |

సితార ఎంటర్‌టైన్మెంట్స్ పై సరికొత్త సినిమాను ప్రకటించాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నల గడ్డ

కొత్త సినిమా అప్డేట్ ఇచ్చిన సిద్ధు.. ఫాంటసీ ఎంటర్‌టైనర్ స్టార్ట్
X

దిశ, సినిమా: ఇటీవల రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’చిత్రంతో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ.. పండుగ సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం తాజాగా నిర్వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాల బ్యానర్స్‌పై నర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుందని వెల్లడించారు. ఇది సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుండగా.. ఈ చిత్రం సిద్ధు జొన్నల గడ్డకు మంచి విజయం అందిచాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ‘ఈ ఉగాదికి ఒక కొత్త ప్రయాణం ప్రారంభం.. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాల కలయికలో వస్తున్న ఈ భారీ ఫాంటసీ ఎంటర్‌టైనర్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ నెట్టింట సందడి చేస్తున్నాయి.

Next Story