బాలీవుడ్ హీరో ఇంట తీవ్ర విషాదం

by velandi.Saikiran |

సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా ఫిబ్రవరి 14, శనివారం ఢిల్లీలో దీర్ఘకాల అనారోగ్యంతో మరణించారు

బాలీవుడ్ హీరో ఇంట తీవ్ర విషాదం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే మన ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులను కోల్పోయాం. ముఖ్యంగా కరోనా సమయం నుంచి ఇప్పటివరకు ఎంతోమంది దిగ్గజ నటీ, నటులు మరణించారు. కరోనా, గుండెపోటు, దీర్ఘకాలిక సమస్యల కారణంగా చాలామంది ప్రముఖులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ( Sidharth Malhotra) తండ్రి సునీల్ మల్హోత్రా ( Sunil Malhotra) మృతి చెందారు.

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇంట విషాదం

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో సునీల్ మల్హోత్రా బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ దీర్ఘ కాలిక అనారోగ్యం కారణంగా ఆయన మరణించారు. ఫిబ్రవరి 14వ తేదీన రాత్రిపూట సునీల్ మల్హోత్రా మరణించారు. కానీ ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.

తన తండ్రి మరణించినట్లు సోషల్ మీడియాలో తాజాగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్ పెట్టారు. దీంతో విషయం బయటకు వచ్చింది. ఢిల్లీలోనే కుటుంబ సభ్యుల సమక్షంలోనే సిద్ధార్థ్ మల్హోత్రా అంతక్రియలు పూర్తి అయ్యాయి. దీనికి సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయన భార్య కియారా అద్వానీ ఇద్దరు కూడా హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మృతి చెందిన నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Next Story