- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమకు చిహ్నంగా రూ. 1.12 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన హీరో?
బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించి స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే..? ఈ ముద్దుగుమ్మ త్వరలో తల్లి కాబోతుంది. కియారా అద్వానీ ప్రస్తుతం నిండు గర్భంతో ఉంది. కొన్ని డేస్ కిందటే ఈ తీపికబురును వీరు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలియజేశారు.
రీసెంట్‌గానే కియారా అండ్ సిద్ధార్థ్ హాస్పిటల్‌కు వెళ్లి వస్తుండగా.. వీరు పలువురు ఫొటో గ్రాఫర్లకు చిక్కారు. దీంతో సిద్ధార్థ్ వారిపై అసహనం వ్యక్తం చేశాడు.కియారా అసౌకర్యంగా ఫీల్ అవ్వడంతో.. సిద్ధార్థ్ వెంటనే మీరంతా వెనక్కి వెళ్లిపోండి అంటూ కోపోద్రిక్తుడయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ క్రమంలోనే మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. భార్యపై ప్రేమతో సిద్ధార్థ్ మల్హోత్రా ఓ భారీ బహుమతి ఇచ్చాడని సమాచారం.
షెర్షా సినిమాతో ఈ జంట ఒక్కటైన విషయం తెలిసిందే. సినిమా కోసం కలిసి పనిచేస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని టాక్. తర్వాత రెండేళ్లు డేటింగ్‌లో ఉండి.. ఫిబ్రవరి 7, 2023న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ వివాహం చేసుకున్నారు. ఈ జంట ఇప్పుడు తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సిద్ధార్థ్ ప్రేమకు చిహ్నంగా త్వరలో తల్లి కాబోయే కియారాకు రూ. 1.12 కోట్ల విలువైన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని బాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. భారీ ఖరీదైన కారు టయోటా వెల్‌ఫైర్ ఇచ్చారట.






