Siddu Jonnalagadda : ఆ సీన్స్ చెయ్యడానికి హీరోయిన్ ఇబ్బంది పడింది.. సిద్ధు షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’.

Siddu Jonnalagadda : ఆ సీన్స్ చెయ్యడానికి హీరోయిన్ ఇబ్బంది పడింది.. సిద్ధు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తెలుసు కదా’. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వైవా హర్ష ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నీరజ కోన తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ అక్టోబర్ 17 గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధు సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.

‘ఈ సినిమాలో నాది చాలా రాడికల్ క్యారెక్టర్. మాట్లాడే పద్దతి కానీ, థింకింగ్, ఐడియాలజీ చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటాయి. మనం మాట్లాడే దానికి అవతల మనిషి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఉన్నట్లు ఉంటుంది. అసలు రాశీఖన్నా అయితే క్లైమాక్స్‌లో ఈ సీన్స్ నేను చెయ్యను.. అని చెప్పి పక్కకు వెళ్లిపోయింది. ‘నా బాయ్ ఫ్రెండ్ అలా ఎలా మాట్లాడతాడు.. అలా మాట్లాడితే నేను చంపేస్తా, వదిలేస్తా’ అంటూ అరగంట పక్కకు వెళిపోయింది. అప్పుడు నేను .. అక్కా తొమ్మిది పేజీలు ఉన్నాయి ఇంకా.. నువ్వు క్యారెక్టర్‌లో ఫీల్ అవ్వకు.. నువ్వు రాశీఖన్నావు.. అంజలివి కాదు. ఇదొక జస్ట్ సినిమా అని చెప్పాను.. ఆ రేంజ్‌లో ఉంటుంది’ అని తెలిపాడు. అలాగే టిల్లు సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ టిల్లు క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్. చాలా స్టూపిడ్ ఫెలో. కానీ వరుణ్ అలా కాదు.. టిల్లు అనే క్యారెక్టర్ నుంచి బయటపడటం కోసమే ఈ సినిమా చేస్తున్నా’ అంటూ తెలిపాడు సిద్ధు.

Next Story