- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త అవతారంలో సిద్ధు జొన్నలగడ్డ..ఆ ఓటీటీతో భారీ డీల్ ?
సిద్ధుతో ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోందట.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డీజే టిల్లు సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు, ఇప్పుడు వరుసగా సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ఇటీవల తెలుసు కదా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సిద్దు జొన్నలగడ్డకు బంపర్ ఆఫర్ తగిలినట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డతో ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీలింగ్ చేసుకునేందుకు సిద్ధమైందట.
బాలయ్య చేసే Unstoppable షో తరహాలోనే మరో అదిరిపోయే షో సిద్దు జొన్నలగడ్డ చేయబోతున్నారట. ఈ మేరకు సిద్ధుతో ఆ ప్రముఖ ఓటీటీ సంస్థ ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోందట. అన్ని ఓకే అయితే వచ్చే సంక్రాంతి వరకు ఈ నాన్ - ఫిక్షన్ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో హోస్టుగా సిద్దు జొన్నలగడ్డ కనిపించబోతున్నట్లు టాక్. తెలంగాణ యాస భాష ఒట్టి పడేలా ఈ షో ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






