- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telusu Kada: సిద్ధుతో కిస్ సీన్లకు నో చెప్పిన ఇద్దరు హీరోయిన్లు...?
చెక్ పెడుతూ సంచలన ప్రకటన చేశాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాలో ఒక్క కిస్ సీన్ కూడా పెట్టలేదట. అంటే సాధారణ

దిశ, వెబ్ డెస్క్ : సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిజె టిల్లు సినిమాతో పాపులర్ అయిన సిద్ధు జొన్నలగడ్డ మంచి బ్రాండ్ ఉన్న హీరోగా మారిపోయారు. అలాంటి సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు తెలుసు కదా అనే సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి కన్నా, శ్రీ నిధి శెట్టి ఇద్దరూ హీరోయిన్లుగా నటించనున్నారు. మనోడి సినిమా అంటే కచ్చితంగా రొమాంటిక్ సీన్స్ ఉంటాయని అందరూ అంచనా వేసుకుంటారు.
అయితే అలాంటి వాళ్లకు చెక్ పెడుతూ సంచలన ప్రకటన చేశాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమాలో ఒక్క కిస్ సీన్ కూడా పెట్టలేదట. అంటే సాధారణ రొమాంటిక్ సీన్లతో సరిపెట్టేసారు అన్నమాట. ఈ సినిమాలో కిస్ సీన్లు లేవని స్వయంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. కథ విన్నప్పుడే కిస్ సీన్లు లేకుండా చేయాలని ముందే అనుకున్నట్లు స్పష్టం చేశారు. డిజె టిల్లు పాత్రకు ఈ సినిమాలో క్యారెక్టర్ కు చాలా తేడాలు ఉంటాయని ఆయన వివరణ ఇచ్చారు. ఆ పాత్ర నుంచి బయట పడేందుకు ఈ సినిమా చేసినట్లు వివరించారు. దీంతో హీరోయిన్లు ఇద్దరూ కిస్ సీన్లను రిజెక్ట్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. క్లిక్






