జూన్ 4న 3 BHK.. "తమ్ముడు"తో సిద్ధార్థ్ పోటీ?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-13 11:53:05  IST  )

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్.. ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. గత ఏడాది కమల్ హాసన్‌తో కలిసి నటించిన ‘ఇండియన్-2’ ఘోర వైఫల్యం చెందగా, ఆషికా రంగనాథ్‌తో ‘మిస్ యూ’ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.

జూన్ 4న 3 BHK.. తమ్ముడుతో సిద్ధార్థ్ పోటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvosthanante Nenoddantana), ‘బొమ్మరిల్లు’ (Bommarillu) వంటి చిత్రాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ (Siddharth) .. ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. గత ఏడాది కమల్ హాసన్‌ (Kamal Haasan) తో కలిసి నటించిన ‘ఇండియన్-2’ (Indian 2) ఘోర వైఫల్యం చెందగా, ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath)తో ‘మిస్ యూ’ (Miss You) కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ ఏడాది నయనతార, మాధవన్‌లతో కలిసి నటించిన ‘టెస్ట్’ (Test Movie)) ఓటీటీలో విడుదలై మిశ్రమ స్పందన పొందింది. అయినప్పటికీ, ‘చిన్నా’ (చిత్తా) చిత్రం గతంలో హిట్ కావడంతో సిద్ధార్థ్‌పై అభిమానులకు కాస్త నమ్మకం ఉందనే చెప్పాలి. కొంతకాలంగా కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ ఆధారిత చిత్రాలకు ప్రాధాన్యమిస్తున్న సిద్ధార్థ్.. ‘3BHK’తో (3 BHK Movie) మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

శ్రీ గణేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. జులై 4న తమిళం, తెలుగు భాషల్లో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘3BHK’ చిత్రం మధ్యతరగతి కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్‌తో పాటు శరత్ కుమార్, దేవయాని, ‘గుడ్ నైట్’ (Good Night) ఫేమ్ మీతా రఘునాథ్, చైత్ర జె అచార్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ థియేట్రికల్ రైట్స్‌ను S.P సుబ్బయ్య కొనుగోలు చేశారు. అయితే.. అదే రోజున నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో, వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తమ్ముడు’ సినిమా (Tammudu Movie) కూడా విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ ఇద్దరు హీరోల మధ్య ఆసక్తికర పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరికీ కొంతకాలంగా హిట్ సినిమాలు లేవు. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా ఆ తేదీనే విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. దీంతో జులై 4న బాక్సాఫీస్ వద్ద హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. విశ్వంభర సినిమా ఆ రోజు రిలీజవ్వడం ఖాయమైతే మిగతా రెండు సినిమాలు పోటీనుంచి తప్పుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు సినీ విశ్లేషకులు.

Next Story