Dhadak 2: ప్రేమ కథలో కులం విలన్‌గా మారితే.. ఓటీటీలోకి రాబోతున్న లేటెస్ట్ మూవీ

by Chukka Sudharani |

సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన మూవీ ‘ధడక్ 2’.

Dhadak 2: ప్రేమ కథలో కులం విలన్‌గా మారితే.. ఓటీటీలోకి రాబోతున్న లేటెస్ట్ మూవీ
X

దిశ, సినిమా: సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి జంటగా నటించిన మూవీ ‘ధడక్ 2’. షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ చిత్రం ‘పరియేరుమ్ పెరుమాళ్’కు రీమేక్‌గా రూపొందింది. ఇందులో యువ ప్రేమ కథలో కులం విలన్‌గా మారుతుంది. డైరెక్టర్ షాజియా ఇక్బాల్‌కు ఇది మొదటి చిత్రం అయినప్పటికీ.. సమాజంలో పలు చోట్లు ఎదుర్కొంటున్న కుల వివక్ష గురించి స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు.

ఆగస్టు 1న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ధడక్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లింక్స్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపింది. కరణ్ జోహార్, ఉమేష్ కుమార్ బన్సాల్, అదార్ పూనావాలా, అపూర్వ మెహతా, మీను అరోరా, సోమెన్ మిశ్రా, ప్రగతి దేశ్‌ముఖ్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ సౌరభ్ సచ్‌దేవా, జాకీర్ హుస్సేన్, విపిన్ శర్మ అండ్ హరీష్ ఖన్నా ప్రధాన పాత్రల్లో కనిపించారు. లింక్


Next Story