సీరియల్ నటి విడాకులు.. భర్తకు భరణం చెల్లించిన రికార్డు.. లక్షల విలువైన ఆస్తులు కోల్పోయినా.. నా బిడ్డ కన్నా ఏదీ ఎక్కువ కాదంటూ ప్రకటన

by Sujitha Rachapalli |   (  Updated:2025-05-24 19:00:14  IST  )

దిశ, ఫీచర్స్ : ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కామన్.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మరింత కామన్.. కానీ భరణం చెల్లించే విషయంలో మాత్రం భారీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా హీరో జయం రవి విడాకుల కేసులో ఆయన మాజీ భార్య ఆర్తి నెలకు

సీరియల్ నటి విడాకులు.. భర్తకు భరణం చెల్లించిన రికార్డు.. లక్షల విలువైన ఆస్తులు కోల్పోయినా.. నా బిడ్డ కన్నా ఏదీ ఎక్కువ కాదంటూ ప్రకటన
X

దిశ, ఫీచర్స్ : ఫిల్మ్ ఇండస్ట్రీలో విడాకులు కామన్.. మళ్లీ పెళ్లి చేసుకోవడం మరింత కామన్.. కానీ భరణం చెల్లించే విషయంలో మాత్రం భారీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా హీరో జయం రవి విడాకుల కేసులో ఆయన మాజీ భార్య ఆర్తి నెలకు రూ. 40 లక్షల అలిమొనీ కోరి.. పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఈ మధ్య డొమెస్టిక్ వాయిలెన్స్ పేరుతో కేసులు వేసి భర్తల నుంచి ఈ విధంగా డబ్బులు గుంజడం నార్మల్ అయిపోందని కొన్ని కేసులు చూసి విమర్శిస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి భరణం తీసుకోకుండా.. గౌరవ మర్యాదలు పోగొట్టుకోకుండా.. రూ. 200 కోట్లు తిరస్కరించిన ఒకే ఒక్క నటిగా సమంత ప్రశంసలు అందుకోవడం విశేషం.

కాగా ఇంతకు మించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ హిందీ టెలివిజన్ నటి శ్వేతా తివారి.. తన మాజీ భర్త రాజా చౌదరికి 2007లో విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా సుమారు 93 లక్షల రూపాయల విలువైన ఒక బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను ఇచ్చినట్లు తెలుస్తోంది. 1998లో వివాహమైన ఈ జంట.. ఐదేళ్ల న్యాయ పోరాటం తర్వాత విడిపోయారు. శ్వేతా గృహ హింస, రాజా మద్యపాన అలవాటును విడాకులకు కారణాలుగా పేర్కొంది. తమ కుమార్తె పలక్ తివారీ సంరక్షణ పొందడానికి ప్రాధాన్యత ఇచ్చిన శ్వేత.. ఇందుకోసం ఆస్తిని బదిలీ చేయడానికి అంగీకరించింది. రాజా మొదట్లో పలక్‌తో ఫ్లాట్ ఉమ్మడి యాజమాన్య ప్రతిపాదనను తిరస్కరించాడు. దీంతో శ్వేత ఆ ఫ్లాట్‌ను పూర్తిగా వదిలివేసింది. తన కుమార్తె సంరక్షణే తనకు అత్యంత కీలకమని.. పలక్ కంటే ఏదీ ముఖ్యం కాదని స్పష్టం చేసింది.

Next Story