‘శుభం’ ట్రైలర్ రిలీజ్.. ఫైనల్‌గా ఆ లుక్‌లో కనిపించి బిగ్ సర్ ప్రైజ్ చేసిన సమంత.. వీడియో వైరల్

by I. Sairam |   (  Updated:2025-07-26 03:30:16  IST  )

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

‘శుభం’ ట్రైలర్ రిలీజ్.. ఫైనల్‌గా ఆ లుక్‌లో కనిపించి బిగ్ సర్ ప్రైజ్ చేసిన సమంత.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ భామ నిర్మాతగా ‘శుభం’(Shubham) అనే సినిమాను నిర్మించింది. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహించారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఆదివారం (ఏప్రిల్ 27) నాడు శుభం మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

శుభం ట్రైలర్‌ను గమనిస్తే.. ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. అలా ఈ మూవీలో కామెడీ, హర్రర్, క్యూరియాసిటీ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

Video Link

Next Story