Shruti Haasan: శ్రుతి హాసన్ బర్త్ డే స్పెషల్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త సినిమా పోస్టర్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan), కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

Shruti Haasan: శ్రుతి హాసన్ బర్త్ డే స్పెషల్.. క్యూరియాసిటీ పెంచుతున్న కొత్త సినిమా పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శృతి హాసన్(Shruti Haasan), కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇక తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ, పవన్ కళ్యాణ్, నాగచైతన్య, చిరంజీవి వంటి హీరోలతో నటించి తన పాపులారిటీని పెంచుకుంది. 2023లో ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన నటించిన ‘సలార్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఈ క్రమంలోనే.. అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. కానీ పలు కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. దీంతో శృతి హాసన్ అభిమానులు డైలమాలో పడిపోయారు. ఆమె సినిమాలకు దూరం అవుతుందా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. దీంతో నిరాశలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో.. నేడు (జనవరి 28) శృతి హాసన్ పుట్టినరోజు కావడంతో ఆమెకు డైరెక్టర్ మిస్కిన్(Mysskin) విషెస్ తెలుపుతూ ‘ట్రైన్’ సినిమా పోస్టర్‌ను షేర్ చేశారు.

ఇందులో ఆమె బైక్‌పై కూర్చొని కోపంగా చూస్తున్నట్లుగా కనిపించింది. ఇక దీనికి ఆమె ‘‘చాలా కృతజ్ఞతలు సార్. నాతో చాలా అద్భుతంగా ఉన్న మీ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది. అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా.. తమిళంలో ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం. దీనిని వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఫైజి ఫాతిమా నిర్మిస్తోంది. శృతి పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కాగా, ప్రస్తుతం శృతి హాసన్ రజినీకాంత్(Rajinikanth) ‘కూలీ’ మూవీలో నటిస్తుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ కావడంతో సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది.

Next Story