- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shruti Haasan: గోల్డ్ కలర్ సిల్క్ శారీలో ఆ అందాలతో ఆకట్టుకుంటున్న శృతిహాసన్
గోల్డ్ కలర్ సిల్క్ శారీలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో అందాలతో ఆకట్టుకుంటున్న శృతి హాసన్.

దిశ, వెబ్ డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తమిళ చిత్రాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన మొదట తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఆ తర్వాత ఏకకాలంలో ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. 2023లో వీర సింహారెడ్డి, వాల్టేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ పార్ట్–1 చిత్రాలతో వరుస విజయాలు అందుకుని ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ తర్వాత ఈ బ్యూటీ కాస్త సైలెంట్ అయ్యింది.
ఈ మధ్యకాలంలో ఈమె పెద్దగా సినిమాలతో ప్రేక్షకులను పలకరించలేదు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో తన అందాలతో యువత హార్ట్ బీట్ పెంచిన ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టివ్‌గా ఉంటోంది. అయితే అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలతో కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది.
తాజాగా శృతిహాసన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ నటి గోల్డ్ కలర్ సిల్క్ చీర కట్టుకొని, మెడలో హెవీ నెక్లెస్, చెవులకు జుమ్కాలు ధరించింది. చీరపై ఉన్న జరీ బోర్డర్, అలాగే మిర్రర్ వర్క్ ఉన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఆమె అందాన్ని మరింతగా పెంచాయి.
ఈ ఫోటోలలో ఆమె తన కురులను చక్కగా వెనక్కు వేసుకొని, కొన్ని ఫోటోలలో స్మైల్ ఇస్తూ, మరికొన్ని ఫోటోలలో కిందికి, పక్కకు చూస్తూ స్టిల్స్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఫోటోలలో ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






