- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shruti Haasan: డెవిల్ రెడ్ కలర్‌లో ఉంటుందా? లేదా మనం L ని తీసేస్తామా?
ప్రముఖ హీరో అయిన కమల్ హాసన్ (Kamal Haasan) కూతురైన హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ హీరో అయిన కమల్ హాసన్ (Kamal Haasan) కూతురైన హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుంటుంది. తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హే రాం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి జనాల్ని మెప్పించింది. అలాగే సోహం షా (Soham Shah) దర్శకత్వంలో తెరకెక్కిన లక్ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) సరసన హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
శృతి హాసన్‌కు తొలి చిత్రమైన లక్ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. తర్వాత కె. రాఘవేంద్రరావు (Raghavendra Rao) కుమారుడైన కె. ప్రకాష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ (Siddharth) సరసన అనగనగా ఓ ధీరుడు మూవీలో నటించింది. మూవీ నార్మల్ టాక్ సొంతం చేసుకున్న శృతి హాసన్ నటనకు మాత్రం ఉత్తమ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలిం ఫేర్ అవార్డు సొంతం చేసుకుంటుంది.
అంతేకాకుండా ఈ బ్యూటీ శృతి హాసన్ దిల్‌తో బచ్చాహై జీ మూవీలో, సూర్య సరసన సెవెంత్ సెన్స్, ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్ (Gabbar Singh), బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, క్రాక్, వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. రెడ్ కలర్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఈ పోస్ట్‌కు శృతి హాసన్ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘డెవిల్ రెడ్ కలర్‌లో ఉంటుందా? లేదా మనం L ని తీసేస్తామా?’’ జోడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






