Shruti Haasan : నా చిరకాల కోరిక అదే..శృతిహాసన్ బోల్డ్ కామెంట్స్ !

by velandi.Saikiran |   (  Updated:2025-07-28 12:18:18  IST  )

టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు

Shruti Haasan : నా చిరకాల కోరిక అదే..శృతిహాసన్ బోల్డ్ కామెంట్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు... అలాగే సొంతగా పైకి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ఇక కమల్ హాసన్ ( Kamal Hassan) కూతురుగా.. ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు శృతి హాసన్ (Shruti Haasan). ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసి.. ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోయిన్ గా మారిపోయారు.

అయితే అలాంటి హీరోయిన్ శృతి హాసన్.. తాజాగా తన డ్రీమ్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సంగీతం అంటే ప్రాణమని... సినిమాలలో ఓ మ్యూజిషియన్ పాత్ర చేయాలన్నదే తన చివరి కోరిక అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ అందాల తార. మంచి కథలు వస్తే కచ్చితంగా... సినిమాలు చేస్తానని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో.. ఎలాంటి హీరో అయినా తనకు సంబంధం లేదని.. కథలో దమ్ము ఉంటే కచ్చితంగా సినిమా ఒప్పుకుంటానని వివరించారు.

ఇది ఇలా ఉండగా.. ఈ అందాల తార శృతిహాసన్ హీరో రజనీకాంత్ చేస్తున్న కూలీ ( Coolie) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామా సినిమా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ కానుంది. ఇందులో నాగార్జున విలన్ గా కనిపించనుండగా.. ఉపేంద్ర, అమీర్ ఖాన్, సత్యరాజ్ లాంటి వారు కూడా ఉన్నారు.

Next Story