- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా కానీ ఆ తప్పు మాత్రం చేయను : శృతి హాసన్
బ్యూటిపుల్ శృతి హాసన్ నటిగానే కాదు సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్‌గా కూడా మంచి మార్కులు కొట్టేసింది. తండ్రి కమల్ హాసన్‌కు తగిన కూతురు అనిపించుకుంది. ముఖ్యంగా ఈ మధ్య ‘వారణాసి’లో పాడిన ‘సంచారి’ సాంగ్‌లో ఆమె వోకల్స్‌కు జనం ఫిదా అయిపోయారు.

దిశ, సినిమా : బ్యూటిపుల్ శృతి హాసన్ నటిగానే కాదు సింగర్ అండ్ మ్యూజిక్ కంపోజర్‌గా కూడా మంచి మార్కులు కొట్టేసింది. తండ్రి కమల్ హాసన్‌కు తగిన కూతురు అనిపించుకుంది. ముఖ్యంగా ఈ మధ్య ‘వారణాసి’లో పాడిన ‘సంచారి’ సాంగ్‌లో ఆమె వోకల్స్‌కు జనం ఫిదా అయిపోయారు. ప్రొఫెషనల్ కెరీర్‌లో యూనిక్‌గా ఉన్న శృతి.. పర్సనల్ కెరీర్‌లో కూడా డిఫరెంట్‌గానే ఉంది. తల్లిదండ్రులు తన చిన్నప్పుడే విడిపోవడాన్ని తట్టుకోలేకపోయానని.. ఏ స్థితిలోనైనా జీవించే కేపబిలిటీ ఉండాలని డిసైడ్ చేసుకున్నానని తెలిపింది. చిన్నప్పుడు ఏర్పడ్డ పరిస్థితులు ఇందుకు కారణమని చెప్పింది. అంతేకాదు ఓ ఆర్టిస్టుతో బ్రేకప్ కూడా చెప్పేసిన బ్యూటీ.. అసలు పెళ్లి అంటేనే భయమని తెలిపింది. అంతేకాదు జనాలు వివాహానికి పెట్టే ఖర్చు చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుందని.. అసలు ఇదంతా అనవసరమని తేల్చేసింది. ఒకవేళ తాను మ్యారేజ్ చేసుకుంటే మాత్రం పక్కా రిజిస్టర్ మ్యారేజ్ మాత్రమేనని.. ఇందులో డౌట్ లేదని, ఇదే బెస్ట్ అని స్పష్టం చేసింది.






