సింపుల్ గ్రీన్ సారీలో హాట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న శ్రద్దాదాస్

by Pulgam srinivas |   (  Updated:2026-05-01 15:25:16  IST  )

నడుము అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రద్ధాదాస్

సింపుల్ గ్రీన్ సారీలో హాట్ లుక్స్‌తో ఫిదా చేస్తున్న శ్రద్దాదాస్
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె 2008లో విడుదలైన ‘సిద్దు ఫ్రం శ్రీకాకుళం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది.

ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో, ఇందులో ఈ నటి తన నటనతో పాటు అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో తెలుగు సినిమా పరిశ్రమలో శ్రద్ధాదాస్‌కు మంచి గుర్తింపు లభించింది.

ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు పలు హిందీ చిత్రాల్లో కూడా నటించి అక్కడ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా తన గ్లామర్‌తోనే ఎక్కువసార్లు ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

అందులో లైట్ గ్రీన్ కలర్ చీరను, దానికి తగ్గ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను ధరించి, తన నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. ఈ లుక్‌లో శ్రద్ధాదాస్ ఎంతో అందంగా కనిపించడంతో, ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story