- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shraddha Srinath : క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్న శ్రద్ధా శ్రీనాథ్.. ట్రైలర్ ఎలా ఉందంటే?
శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’.

దిశ, సినిమా: శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సిరీస్‌ను రాజేష్ ఎం.సెల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ‘ది గేమ్’ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ విషయానికి వస్తే.. శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో గేమ్ డెవలపర్‌గా నటిస్తుంది. అనుకొకుండా ఆమెపై అటాక్ జరుగుతుంది. అయితే ఆ అటాక్ చేసిన వాళ్లనూ, వాళ్ల వెనకున్న వాళ్లనూ ట్రాప్ చేసే ఆమె ప్రయాణమే ఈ సిరీస్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్‌తో ఆడియన్స్‌కి విభిన్నమైన అనుభూతిని అందించేలా సిరీస్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నిజం, అబద్ధం మధ్య సన్నని గీత గురించి చెప్పే కథ ఇదని దర్శకుడు రాజేష్ ఎం.సెల్వా అన్నారు. ప్రజెంట్ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటుంది.
- Tags
- Shraddha Srinath






