- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shraddha Srinath: బికినిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న జెర్సీ బ్యూటీ.. థైస్-ఎద అందాలతో పిచ్చేక్కిస్తుందిగా..
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి శ్రద్ధా శ్రీనాథ్.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది నటి శ్రద్ధా శ్రీనాథ్. చివరగా ఈ ముద్దుగుమ్ కలియుగం 2064 అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇది సింప్లీ సౌత్ ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం భవిష్యత్తులో జరిగే మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగింది. ఇందులో మానవ మనుగడ కోసం పోరాటం ఉంటుంది. ఇక ఆర్. కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె. ఎస్. రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు.
ఇక శ్రద్ధా శ్రీనాథ్.. నాని నటించిన ‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అలాగే ఈ ముద్దుగుమ్మ 2015లో తెరకెక్కిన కోహినూర్ సినిమా ద్వారా మలయాళం సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వీటితో పాటుగా ముంగారు మేల్ 2, ఉర్వి, కాట్రు వెళియిదై, ఇవన్ తంతిరాన్, విక్రమ్ వేద, రిచి, కృష్ణ అండ్ హిజ్ లీలా, డియర్ విక్రమ్, విట్నెస్, ఇరుగపాట్రు, మెకానిక్ రాకీ, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం యూ టర్న్ చిత్రానికి గాను ఆమె ఫిలిం ఫేర్ అవార్డు అందుకుంది.
ఇకపోతే ఈ బ్యూటీ సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన వ్యక్తిగత, వృత్తిపర విషయాల్ని పంచుకుంటుంది. మాల్దీవ్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు షేర్ చేసి.. ‘అది కల కాదు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ బికినిలో కనిపించి.. కుర్రాళ్లకు పిచ్చేక్కిస్తోంది. ప్రస్తుతం ఈ నటి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






