- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంచనాలను పెంచుతున్న శ్రద్ధా కపూర్ ‘ఈత’ టీజర్..
ఈ టీజర్‌లో శ్రద్ధా కపూర్ మునుపెన్నడూ చూడని సరికొత్త మరాఠీ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఈత’. లెజెండరీ మరాఠీ లావణి నృత్యకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రణదీప్ హుడా, అనంత్ జోషి కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్టు 26న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను దినేష్ విజన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండటంతో భారీ హైప్ క్రియేట్ అయింది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా.. అది కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ టీజర్‌లో శ్రద్ధా కపూర్ మునుపెన్నడూ చూడని సరికొత్త మరాఠీ అవతారంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా, విఠాబాయి ఒంటరిగా బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే.. ఆ నొప్పులను భరిస్తూ మళ్లీ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేసే ఎమోషనల్ సీన్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచింది. టీజర్ విజువల్స్, శ్రద్ధా స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పసుపు రంగు సంప్రదాయ దుస్తులలో, గజ్జల సవ్వడితో శ్రద్ధా కపూర్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘ఈత’ టీజర్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయనడంలో అతిశయోక్తి లేదు.






