- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
90 శాతం కంప్లీట్ అయినా శ్రద్ధా కపూర్ 'ఈత'
శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈత మూవీ షూటింగ్ 90 శాతం పూర్తయింది. మొత్తం షూటింగ్ను మరో రెండు వారాల్లో కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ఈత చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ప్రఖ్యాత తమాషా కళాకారిణి వితాబాయి నారాయణంగావ్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. రణదీప్ హుడా ఈ మూవీలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 90 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది. మరో రెండు వారాల్లో ఈ సినిమా మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు, అందుకనుగుణంగా అన్ని ప్రణాళికలను రూపొందించినట్లు తెలుస్తుంది.
ఈ షూటింగ్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఈ మూవీ నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రద్ధ కపూర్ ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్ చిత్రాలలో నటించి తన అందాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాతో మంచి విజయం దక్కినట్లయితే నటిగా కూడా ఈమెకు ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






