- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏంటి పుష్పాలో షెకావత్ రోల్‌ను ఆ హీరో చేయాల్సిందా.. అయ్యయ్యో మంచి చాన్స్ మిస్ చేసుకున్నాడే
స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’(Pushpa).

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’(Pushpa). అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ మూవీలో అల్లు అర్జున్ పాత్ర ఎంత హైలెట్ అయిందో పోలీస్ ఆఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది. ‘పుష్ప’ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇచ్చిన షెకావత్ ‘పార్టీ లేదా పుష్పా’ అంటూ ఒక్క డైలాగ్‌తో అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు.
అయితే భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో మలయాళ యాక్టర్ ఫహాద్ ఫాజిల్(Fahad Fazzil) నటించాడు. పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి అలరించాడు. అయితే అసలు ఆ పాత్ర నారా రోహిత్ చేయాల్సిందట. ‘భైరవం’(Bhairavam) ప్రమోషన్లతో బిజీగా ఉన్నా నారా రోహిత్(Nara Rohith) తాజాగా ఈ విషయాన్ని రివీల్ చేశారు. ‘ కరోనా టైమ్‌లో నేను మీసాలతో ఉన్న ఓ ఫోటోని నాకు పంపించిన నిర్మాత ఆ రోల్ గురించి చెప్పారు.
అది నాకు కూడా నచ్చడంతో ఓకే అని చెప్పా. అయితే ‘పుష్ప’ని పాన్ ఇండియా లెవల్‌లో తీస్తుండటంతో అన్ని భాషల నటులు ఉండాలని అనుకుని భన్వర్‌సింగ్ షెకావత్ రోల్‌కి ఫహాద్ ఫాజిల్‌ని తీసుకున్నారు’ అని చెప్పుకొచ్చారు నారా రోహిత్. షెకావత్ పాత్రలో నారా రోహిత్ చేసి ఉంటే ఆయన ఫేట్ మారి ఉండేదని, మంచి చాన్స్ మిస్ చేసుకున్నావు భయ్యా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






