Atlas Cycle Attagaru Petle: ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ షూటింగ్ స్టార్ట్..

by Chukka Sudharani |

‘కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ’ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు (Karthik Raju) ప్రస్తుతం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ (Atlas Cycle Attagaru Petle) అనే కొత్త మూవీని ప్రారంభించారు.

Atlas Cycle Attagaru Petle: ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ షూటింగ్ స్టార్ట్..
X

దిశ, సినిమా: ‘కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ’ లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న కార్తిక్ రాజు (Karthik Raju) ప్రస్తుతం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ (Atlas Cycle Attagaru Petle) అనే కొత్త మూవీని ప్రారంభించారు. ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి (Kajal Chaudhary) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై గాలి కృష్ణ రూపొందిస్తుండగా.. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. రామా నాయుడు స్టూడియో(Rama Naidu Studio)లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాస రావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా.. హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్‌కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ .. ‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యంతో పాటు ఎమోషనల్‌గానూ ఉంటుంది. 1980 లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాము. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కార్తిక్ రాజు, కాజల్ చౌదరి గార్లతో ఈ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మా నిర్మాత గాలి కృష్ణ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా కోసం వచ్చిన సురేష్ బాబు, తమ్మారెడ్డి, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, చైతన్య అందరికి కృతజ్ఞతలు తెలిపారు’ అని తెలిపారు. ఇది వరకు దర్శకుడు రాజా దుస్సా హన్సికతో ‘105 మినిట్స్’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

Next Story