హైదరాబాద్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్.. వారిద్దరి మధ్య కీలక సన్నివేశాలు..

by Gugulothu.Kavitha |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న తాజా సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Thaluka).

హైదరాబాద్‌లో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్.. వారిద్దరి మధ్య కీలక సన్నివేశాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న తాజా సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Thaluka). మహేష్ బాబు పి(Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర(Upendra) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామ్- ఉపేంద్రల మధ్య జరిగే కొన్ని కీలక సన్నివేశాలు తాజాగా హైదరాబాద్‌లో స్టార్ట్ అయ్యాయి.

అయితే ఈ షూటింగ్ నెల రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ మరియు భాగ్యశ్రీ బోర్సే మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలను రాత్రి నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ నైట్ టైమ్‌లో జరిగే షెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగుతుంది, ఆ తర్వాత క్లైమాక్స్ అండ్ ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి బృందం తదుపరి 20 రోజులు పగటిపూట షూటింగ్‌ చేయనున్నారట. దీంతో ఈ చివరి షెడ్యూల్‌తో, సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story