అన్నీ అబద్ధాలేనా?.. ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్ సినిమాల కలెక్షన్స్‌పై షాకింగ్ న్యూస్ వైరల్?

by Gantepaka Srikanth |

తెలుగు(TollyWood)తో పాటు ప్రస్తుతం అన్ని భాషల్లో విడుదలైన తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో తెలుపుతూ చిత్రబృందాలు పోస్టర్స్ విడుదల చేయడం కామన్‌గా మారిపోయింది.

అన్నీ అబద్ధాలేనా?.. ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్ సినిమాల కలెక్షన్స్‌పై షాకింగ్ న్యూస్ వైరల్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు(TollyWood)తో పాటు ప్రస్తుతం అన్ని భాషల్లో విడుదలైన తొలిరోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయో తెలుపుతూ చిత్రబృందాలు పోస్టర్స్ విడుదల చేయడం కామన్‌గా మారిపోయింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తెరకెక్కించిన బాహుబలి సిరీస్‌ల నుంచి ఈ విధానం మొదలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సినిమా టాక్ ఎలా ఉన్నా... హిట్టైనా, ఫట్టైనా తొలిరోజు కలెక్షన్ల పోస్టర్లు మాత్రం రికార్డు స్థాయిలో వచ్చినట్లు వేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కలెక్షన్లపై షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. ‘ఎట్ థియేటర్స్’ అనే అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.


ప్రభాస్(Prabhas) నటించిన సలార్‌(Salaar)కు తొలిరోజు రూ164 కోట్లు రాగా.. పోస్టర్‌లో మాత్రం రూ.178 కోట్లు అని వేశారని.. అలాగే మహేశ్ బాబు(Mahesh Babu) నటించిన గుంటూరుకారం(Guntur Kaaram) సినిమాకు రూ.68 కోట్లు వస్తే రూ.94 కోట్లు అని, ఎన్టీఆర్(NTR) దేవర(Devara) సినిమాకు రూ.133 కోట్లు వస్తే రూ.172 అని, అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప-2(Pushpa-2) సినిమాకు రూ.209 కోట్లు వస్తే రూ.294 కోట్లు అని తాజాగా రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్‌(Game Changer)కు రూ.159 కోట్లు వస్తే రూ.186 కోట్లు అంటూ పోస్టర్స్ వదిలారంటూ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలా కోట్లకు కోట్లు లెక్కల్లో మార్పులు చేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ హీరో ఆ హీరో అనే తేడా లేకుండా అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అవుతున్నారు. ఒరిజినల్ కలెక్షన్ల పోస్టర్లే వేయాలని నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Next Story