- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్.. విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ బ్యూటీ.. ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చేసిందిగా!
సినిమా ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమలో చాలా జంటలు చిన్న చిన్న మనస్పర్థలతో డైవర్స్ తీసుకుని విడిపోయిన వారు ఎందరో ఉన్నారు.

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. గత కొద్ది కాలంగా సినీ పరిశ్రమలో చాలా జంటలు చిన్న చిన్న మనస్పర్థలతో డైవర్స్ తీసుకుని విడిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వారు కూడా ఏవో కారణాల వల్ల తమ భాగస్వామికి దూరం అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు. ఎన్నేళ్ల బంధం అయినప్పటికీ చిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ జంటలు పిల్లలు ఉన్నప్పటికీ తమ భార్యలతో విడిపోయారు. గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో డైవర్స్ అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది అని చెప్పొచ్చు. తాజాగా, ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరో శ్రీకాంత్(Srikanth)తో భావన (Bhavana)‘మహాత్మ’సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు గతంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరుస సినిమాలు చేసింది.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే భావన ప్రముఖ నిర్మాత నవీన్ రమేష్(Naveen Ramesh)ను పెళ్లాడింది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయి పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. అయితే భావన తన భర్తతో విడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఆమె స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ‘‘గత కొద్ది రోజుల నుంచి నా గురించి కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి. నేను నా భర్తతో విడిపోతున్నాననే ప్రచారం జరుగుతోంది. అయితే నా భర్తతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆమ కారణం వల్ల మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను నా భర్తతో కలిసే జీవిస్తున్నాను. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తాను. యాదృచ్చికంగా ఫొటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తున్నారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా’’ అని చెప్పుకొచ్చింది. దీంతో భావన విడాకులపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. అవన్నీ పుకార్లే అని తేలిపోయింది.
Read More..
Nagachaitanya: క్యూట్ వీడియో షేర్ చేసిన నాగ చైతన్య.. సూపర్ అంటున్న నెటిజన్లు






