- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ న్యూస్.. సినిమాలకు దూరం కానున్న రామ్ చరణ్ బ్యూటీ.. కారణం అదేనా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు బాలీవుడ్, టాలీవుడ్ అనే తేగా లేకుండా పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తెలుగులో రామ్ చరణ్(Ram Charan), మహేష్ బాబు వంటి స్టార్స్ సరసన జతకట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. కానీ కెరీర్ పీక్స్‌లో ఉండగానే హీరో సిద్ధార్థ్ మాల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక గత ఏడాది ‘గేమ్ చేంజర్’(Game Changer) మూవీతో వచ్చింది. రామ్ చరణ్ హీరోగా నటించగా.. శంకర్(Shankar) దర్శకత్వంలో వచ్చి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే కియారా తాను తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ నేథ్యంలో.. తాజాగా, కియారాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ రెండేళ్ల పాటు సినిమాలకు దూరం కాబోతున్నట్లు టాక్. బాబు లేదా పాప పుట్టిన తర్వాత కొంత కాలంపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతనే రీఎంట్రీ ఇవ్వనుందట. బిడ్డ అలనా పాలనా దగ్గరుండి చూసుకోవాలని కియారా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.
Read Also..






