రాంచరణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ‘పెద్ది’ విడుదల వాయిదా

by Kema Shiva Kumar |

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 30న రావాల్సిన మూవీ జూన్‌కు షిఫ్ట్ అయింది.

రాంచరణ్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. ‘పెద్ది’ విడుదల వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

జూన్‌లో గ్రాండ్ రిలీజ్..

ఈ సినిమాను ఇప్పుడు జూన్ నెలలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల్లో నాణ్యత కోసమే ఈ వాయిదా పడినట్లుగా ఫిలిం నగర్ టాక్. రామ్ చరణ్ కెరీర్‌లో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైనది కావడంతో, ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని దర్శకుడు, నిర్మాతలు భావిస్తున్నారు. అయితే, రామ్ చరణ్ సరికొత్త మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా సందడి ఉంటుందని ఆశించిన అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ కలిగించినా.. జూన్‌లో మరింత భారీగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఖచ్చితమైన విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.

Next Story