ఇక్క‌డ సాఫ్ట్‌వేర్ అక్క‌డ పైర‌సీ కింగ్.. ఐబొమ్మ ర‌వి కేసులో మరిన్ని సంచలనాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-16 16:35:48  IST  )

తెలుగు సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐ బొమ్మ వెబ్ సైట్‌ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేశారు. పోలీసులకు సవాలు విసిరిన ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడితోనే ఐ బొమ్మ , బప్పం వెబ్ సైట్ బ్లాక్ చేయించారు. రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పట్టుకొండి చూద్దాం అంటూ పోలీసులకు

ఇక్క‌డ సాఫ్ట్‌వేర్ అక్క‌డ పైర‌సీ కింగ్.. ఐబొమ్మ ర‌వి కేసులో మరిన్ని సంచలనాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలుగు సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐ బొమ్మ వెబ్ సైట్‌ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేశారు. పోలీసులకు సవాలు విసిరిన ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడితోనే ఐ బొమ్మ , బప్పం వెబ్ సైట్ బ్లాక్ చేయించారు. రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పట్టుకొండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసిరారని అప్పటి నుంచి ఈ విషయం సీరియస్‌గా తీసుకున్నట్లు హైదరాబాద్ సీటీ పోలీసులు తెలుపుతున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సైతం పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి కస్టడికి తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నేటి నుంచి కస్టడీ విచారణకు ఇవ్వల్సిందిగా సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఐ బొమ్మ వెబ్ సెట్‌ను యూకె నుంచి కొన్ని సంవత్సరాలు నిర్వహించారని, తరువాత కరేబియన్ దీవుల నుంచి నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. యూకెలో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఫిల్మ్ ఇండస్ట్రికి సంబంధించిన సర్వర్లను హ్యక్ చేసేవాడని గుర్తించినట్లు తెలుపుతున్నారు. తెలుగు సినిమాలకు సబంధించి 2024లో దాదాపు రూ.3వేల 700కోట్ల నష్టం వాటిల్లినట్లు సినీ నిర్మాతలు తెలుపుతున్నారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చలామణీ అయిన రవి

ఐ బొమ్మ వెబ్ సైట్‌ నిర్వహకుడు రవి అరెస్ట్ తరువాత సంచలన విషయాలు వెలుగు చూశాయి. రవి హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా చలామణీ అయినట్లు తెలుస్తుంది. విశాఖ పట్నంకు చెందిన రవి భార్యతో విడాకులు తీసుకుని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. రవి హైదరాబాద్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్న విషయం బహిర్గతం అయింది. విశాఖపట్నంలో ఉంటున్న రవి తండ్రి అప్పారావు ఈ విషయాలు ఏవీ తెలియవని మీడియాకు తెలిపారు. గత పదిహేను సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌‌గా చేస్తున్నట్లు మాత్రమే తమకు తెలుసని, రెండు నెలల క్రితం మాత్రమే మాట్లాడానని తెలిపారు. హైదరాబాద్‌లో అపార్ట్మెంట్‌లో నివాసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చుట్టు ప్రక్కల వారికి కూడా సాఫ్ట్ వేర్‌గా మాత్రమే తెలుసని చెబుతున్నారు.

హైదరాబాద్ పోలీసులకు సీవీ ఆనంద్ అభినందనలు

పోలీసులకు సవాల్ విసిరిన ఐ బొమ్మ వెబ్ సైట్‌ నిర్వహకుడు రవి అరెస్ట్ పట్ల హొం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సీవీ ఆనంద్ హైదరాబాద్ పోలీసులకు అభినందనలు తెలిపారు. సీవీ ఆనంద్ హైదరబాద్‌ కమిషనర్‌గా విధులు నిర్వహించిన అఖరి రోజు సెప్టెంబర్ 29వ తేదీన తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో త్వరలో ఐ బొమ్మ నిర్వహకులను కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. తాజాగా రవిని అరెస్ట్ చేయడంతో సీవీ ఆనంద్ హైదరాబాద్ పోలీసుల కృషిని అభినందించారు.

Next Story