- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాయి పల్లవి సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ సినిమాకు షాకింగ్ కలెక్షన్స్ వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె ఏ సినిమా చేసినా బంపర్ హిట్ కావాల్సిందే. కలెక్షన్స్ రావాల్సిందే. అయితే అలాంటి సాయి పల్లవికి ఊహించిన పరిణామం ఎదురవుతోంది. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన సాయి పల్లవి తొలి బాలీవుడ్ సినిమా ఏక్ దిన్ మొదటి రోజు కలెక్షన్స్ దారుణంగా ఉన్నట్లు సినిమా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఈ సినిమాలో హీరోగా చేయగా... హీరోయిన్ గా సాయి పల్లవి మెరిశారు. అయితే ఈ సినిమా మే ఒకటో తేదీన రిలీజ్ కాగా మొదటి రోజు దేశ వ్యాప్తంగా రూ.1.15 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ ఎంట్రీ సాయి పల్లవికి కలిసి రాలేదని చర్చ జరుగుతోంది. అటు తెలుగులో కూడా ఈ సినిమా ఒక రోజు పేరుతో రిలీజ్ కాగా... కలెక్షన్స్ కూడా డల్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమాకు సునీల్ పాండే దర్శకత్వంలో రాగా, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో తెలుగు ఎక్కింది. 2016 నాటి వన్ డే సినిమాకు ఇది రిమేక్.






