అసలు మీరు పడుకోరా ? అక్కినేని కోడలు క్యూట్ వీడియో వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-05-13 18:26:44  IST  )

అసలు మీరు పడుకోరా ? అంటూ మీడియా వాళ్లను క్యూట్ గా ప్రశ్నించారు అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ.

అసలు మీరు పడుకోరా ? అక్కినేని కోడలు క్యూట్ వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ ఒకరు. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో పుట్టి పెరిగిన ఈ అందాల తార, మోడలింగ్ రంగంలో రాణించి.. 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రన్నరప్ గా కూడా నిలిచారు. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ, తెలుగులో కూడా గూఢచారి లాంటి ఎన్నో సినిమాలు చేశారు. అక్కినేని నాగచైతన్య ను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ, ప్రస్తుతం చిల్ మూడ్ లో ఉన్నారు.

విదేశీ టూర్లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఇద్దరూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగారు. నిన్న అర్ధరాత్రి 12 తర్వాత విమానాశ్రయంలో మెరిసినట్టు తెలుస్తోంది. దీంతో మీడియా ప్రతినిధులు శోభిత, నాగచైతన్య జంటను క్యాప్చర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సందర్భంగా శోభిత ధూళిపాళ వింతగా రియాక్ట్ అయ్యారు. అసలు మీరు పడుకోరా ? అంటూ మీడియా వాళ్లను క్యూట్ గా ప్రశ్నించారు. ఆ తర్వాత చిన్నగా స్మైల్ ఇచ్చి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.



Next Story