- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shobhita Rana: స్కిన్ షో విషయంలో నో కాంప్రమైజ్.. కానీ అలాంటి పరిస్థితిలో బ్యూటీ
తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో హాట్ అందాలతో రెచ్చిపోయిన శోభిత రానా.

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ శోబితా రానా 1992 జూన్ 16న చండీగఢ్‌లో జన్మించింది. ఆమె పాఠశాల విద్య హర్యానాలోని పంచకులలో కొనసాగింది. ఆ తర్వాత చండీగఢ్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
అనంతరం మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి మంచి గుర్తింపు సంపాదించుకొని అనేక టెలివిజన్ ప్రకటనల్లో కనిపించింది. దీని ద్వారా ఆమెకు మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ బ్యూటీ 2014లో “ఇష్క్ బ్రాందీ” అనే పంజాబీ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది.
తెలుగులో “రాజా మీరు కేక”, “రంగ రంగ వైభవంగా” వంటి చిత్రాల్లో కూడా నటించింది. సినిమాల విషయాన్ని పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియా వేదికగా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు.
అందచందాల విషయంలో ఏమాత్రం తగ్గని ఈ హాట్ బ్యూటీకి భారీ క్రేజ్ ఉన్నప్పటికీ, అనుకున్న స్థాయిలో పెద్ద సినిమాల్లో అవకాశాలు మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇక తాజాగా కూడా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఈ చిత్రాల్లో ఈ బ్యూటీ వైట్ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపిస్తూ తన అందంతో ఆకట్టుకుంది. ఇందులో చెవులకు ధరించిన పెద్ద ఇయర్ రింగ్స్ ఆమె గ్లామర్‌ను పెంచగా, చేతులకు వేసుకున్న గాజులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






