- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shobhita Dhulipala: ‘చీకట్లో’ శోభిత ధూళిపాళ.. ఏకంగా 18 భాషల్లో రిలీజ్ కానున్న వెబ్ మూవీ
అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లి తర్వాత ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శోభిత ధూళిపాళ

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లి తర్వాత ప్రజెంట్ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న శోభిత ధూళిపాళ.. ఇప్పుడు ఓ సరికొత్త వెబ్ మూవీతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. దీనికి యువ దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా.. ‘చీకట్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ మూవీని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏకంగా 18 భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతుండటం విశేషం. ఓటీటీలో ఒక సినిమా ఇన్ని భాషల్లో డబ్ కావడం ఇదే మొదటిసారి కావడంతో.. థ్రిల్లర్ జానర్‌లో రానున్న ‘చీకట్లో’ వెబ్ మూవీపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. నవంబర్‌లో దీనిని విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తుండగా.. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.






