‘పెద్ది’లో గౌర్నాయుడుగా అదరగొట్టిన శివరాజ్ కుమార్

by Pulgam srinivas |

‘పెద్ది’ చిత్రంలో శివరాజ్ కుమార్ గౌర్నాయుడు పాత్రలో కనిపించనున్నాడు.

‘పెద్ది’లో గౌర్నాయుడుగా అదరగొట్టిన శివరాజ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది’ చిత్రంలో కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు మేకర్స్ శివన్నకు సంబంధించిన ప్రచార చిత్రాలను పెద్దగా విడుదల చేయలేదు. తాజాగా మేకర్స్ ఆయనకు సంబంధించిన ఒక చిన్న వీడియోను విడుదల చేశారు. ఇందులో శివరాజ్ కుమార్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో కనిపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కథ ప్రకారం, ఆయన కుస్తీ నేర్చుకునే వారికి గురువు పాత్రలో కనిపించనున్నారు. ఒక సన్నివేశంలో కుస్తీ చేస్తున్న ఓ వ్యక్తిని శివన్న గాల్లోకి ఎత్తి బలంగా కింద పడేసే సన్నివేశం ఈ వీడియోకు హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్ సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. మొత్తానికి శివరాజ్ కుమార్ పాత్ర ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న ముంబైలో విడుదల చేయనున్నారు. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.


Next Story