OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ..

by Chukka Sudharani |

వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar), ఆనంది (Anandi) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’

OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
X

దిశ, సినిమా: వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar), ఆనంది (Anandi) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘శివంగి’ (Shivangi). దేవరాజ్‌ భరణి ధరణ్‌ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఫస్ట్‌కాపీ మూవీస్‌ పతాకంపై నరేష్‌ బాబు పి నిర్మించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం నుంచి రిలీజ్‌కు ముందు వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. ఆనంది ఒకరిని ప్రేమించి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.. ఇక పెళ్లైనా మొదటి రోజే తన భర్తకు యాక్సిడెంట్ కాగా.. మంచాన పడతాడు. దీంతో అత్త ఆమెను వేధిస్తూ ఉంటుంది. అదే సమయంలో మాజీ ప్రియుడు ఆనంది లైఫ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తాడు.. ఇక అత్త, కోడలు, మాజీ ప్రియుడు ఇలా ఒక్కరోజులో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆనందిని ఇన్‌వెస్టిగేషన్ (Investigation) చెయ్యడానికి పోలీసులు వస్తారు.

పోలీసు అధికారి అయిన వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎంట్రీతో సినిమాలో ఇంట్రెస్టింగ్ సీన్స్ (Interesting scenes) వస్తాయి. ఇలా ఓవరల్‌గా ఆనంది ఆ సమస్యల నుంచి ఎలా బయటపడింది.. వరలక్ష్మి ఎందుకోసం ఆనందిని వెతుకుంటూ తన ఇంటికి వెళ్లింది అనే సస్పెన్స్‌తో ఈ సినిమా సాగుతుంది. ఇక పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య మార్చి 7న వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది ‘శివంగి’ మూవీ. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (aha) ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే.. ప్రస్తుతం తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. రేపటి నుంచి తమిళ వెర్షన్ విడుదల కాబోతున్నట్లు తెలిపింది.

Next Story