- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప సందేశాన్నిచ్చే ‘మాస్టర్ సంకల్ప్’.. ట్రైలర్ రిలీజ్ చేసిన శివాజీ రాజా
దర్శక నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డా. భీమగాని సుధాకర్ గౌడ్.

దిశ, సినిమా: దర్శక నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు డా. భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్‌పై ఆదిత్య, క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి బాలల చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు తమ ప్రొడక్షన్‌లో ఆరవ చిత్రంగా ‘మాస్టర్ సంకల్ప్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు శివాజీ రాజా విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పిల్లలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. బాలల కోసం నిస్వార్థంగా సినిమాలు రూపొందిస్తున్న డా. భీమగాని సుధాకర్ గౌడ్ అభినందనీయులు. వ్యాపారమయమైన ఇండస్ట్రీలో పిల్లల కోసం సినిమాలు చేస్తున్న ఆయన గొప్ప మనసును మనమంతా ప్రశంసించాలి. మాస్టర్ సంకల్ప్ ట్రైలర్‌ను నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. పిల్లల్లో మానసిక రుగ్మతలను ఎలా పోగొట్టాలి అనే అంశాన్ని ఈ చిత్రంలో ఎంతో ఆసక్తికరంగా, మనసును కదిలించేలా సుధాకర్ గౌడ్ తెరక్కించారు’ అని తెలిపారు.






