- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sivaji : దండోరా విషయంలో అన్ని తప్పులు జరిగాయి
తాజాగా శివాజీ మాట్లాడుతూ... దండోరా సినిమా ఫెయిల్యూర్ కావడానికి ప్రధాన కారణాలు రాంగ్ డేట్, ఆ సినిమా టైటిల్ మరియు దానికి తక్కువ షోలు ఉండటమే అని శివాజీ తాజాగా చెప్పారు.

దిశ, వెబ్ డెస్క్ : కొన్ని రోజుల క్రితం శివాజీ 'దండోరా' అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ భారీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. తాజాగా శివాజీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో దండోరా ఫెయిల్యూర్ కావడానికి గల కారణాలను ఆయన వివరించారు. శివాజీ మాట్లాడుతూ... దండోరా ఫెయిల్యూర్ కావడానికి మొదటి కారణం సినిమా రిలీజ్ డేట్, అది రాంగ్ రిలీజ్ డేట్.
డిసెంబర్ 25వ తేదీన మేము సినిమాను విడుదల చేయాలి అనుకున్నాం. 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. దానితో మా మూవీకి ఎవరూ థియేటర్స్ ఇవ్వలేదు. అందుకు కారణం సెన్సార్ అవుతుందో, లేదో అనే భయంతోనే ఎవరూ థియేటర్స్ ఇవ్వలేదు. సహజంగా అలా జరిగిన సినిమాలకు థియేటర్స్ ఇవ్వరు. ఇక ఆ కథకి ఆ టైటిల్ అస్సలు కరెక్ట్ కాదు, నేను స్క్రిప్ట్ చెప్పిన గంటకే ఆ విషయం చెప్పాను. అలాగే ఒక నెల రోజులు పాటు టైటిల్ మార్చడానికి ప్రయత్నించాను.
మన సమాజంలో దండోరా అనే టైటిల్ వినగానే కమ్యూనిస్టు సినిమా అని అనుకున్నారు. అలాగే హైదరాబాద్ సిటీలో మాకు సాయంత్రం 4, 10 గంటలకు షోలు ఇచ్చారు. అంతకుమించి షోలు పెద్దగా ఇవ్వలేదు. కానీ మా సినిమా నైజాం ఏరియాలో ఒక కోటి కలెక్షన్లను రాబట్టింది. అంత తక్కువ షోలతో కూడా ఆ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. అదే ఎక్కువ స్క్రీన్లు ఉంటే భారీ కలెక్షన్లు వచ్చేవి. ఇలా కొన్ని కారణాలవల్ల దండోరా సినిమా ఫెయిల్యూర్ అయింది అని శివాజీ చెప్పుకొచ్చాడు.






