స్పిరిట్ లుక్‌లో శివాజీ, అనసూయ.. మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అని అంటున్న నెటిజన్స్

by I. Sairam |

స్పిరిట్ పోస్టర్ తరహాలోనే యాక్టర్ శివాజీ, నటి అనసూయ(Anasuya).

స్పిరిట్ లుక్‌లో శివాజీ, అనసూయ.. మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయిరా అని అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’(Spirit) ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తృప్తి దిమ్రి(Tripthi Dimri) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అయితే న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ మూవీ నుంచి సందీప్ రెడ్డి ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి నిండా గాయాలతో ఓ కిటికీ దగ్గర నిల్చుని ఉండగా, హీరోయిన్ తృప్తి దిమ్రి ఆయనకు సిగరెట్ వెలిగిస్తూ కనిపించింది.

ఈ నేపథ్యంలో స్పిరిట్ పోస్టర్ తరహాలోనే యాక్టర్ శివాజీ, నటి అనసూయ(Anasuya) ఫోటో కూడా సోషల్ మీడియాలో ఎడిట్ చేసి పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట హాట్ టాపిక్‌గా మారగా.. చూసిన నెటిజన్లు మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి రా అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శివాజీ(sivaji) ‘దండోరా;(Dandora) మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్స్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపగా అతనికి వ్యతిరేకంగా అనసూయ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే.

Next Story