రాజకీయ నాయకుడి బయోపిక్‌లో స్టార్ హీరో.. అద్భుతంగా ఫస్ట్ లుక్ పోస్టర్

by Chukka Sudharani |

పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరు అందరికీ తెలిసిందే.

రాజకీయ నాయకుడి బయోపిక్‌లో స్టార్ హీరో.. అద్భుతంగా ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: పేద ప్రజల గురించి ఆలోచించే రాజకీయ నాయకుడిగా గుమ్మడి నర్సయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి పేరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను తెరపైకి తీసుకొస్తుండగా.. గుమ్మడి నర్సయ్య పాత్రలో కరుణాడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ నటించబోతున్నారు. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి నిర్మాతగా పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను చూస్తుంటే గుమ్మడి నర్సయ్య పాత్రకు శివ రాజ్ కుమార్ ప్రాణం పోసినట్టుగా కనిపిస్తోంది. సైకిల్, వెనకాల ఉన్న అసెంబ్లీ, ఎర్ర కండువా ఇలా అన్నీ కూడా ఎంతో అథెంటిక్‌గా ఉన్నాయి. ఇక ఈ పోస్టర్‌తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసినట్టు అయింది. ఇక మోషన్ పోస్టర్‌లో ఎమ్మెల్యేలు అంతా కూడా కారులో వస్తుంటే.. గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌లో రావడం.. ఆ మ్యూజిక్, ఆర్ఆర్.. విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తోంది.

Next Story