- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొన్న జననాయకుడు, ఇప్పుడు పరాశక్తి.. తెలుగులో రిలీజ్ కష్టమేనా?
తమిళ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi) సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం పొంగల్/సంక్రాంతి సందర్భంగా జనవరి 10, 2026న (శనివారం) వరల్డ్‌వైడ్ గా రిలీజ్ కానుంది. మొదట జనవరి 14 అని ప్రకటించిన మేకర్స్, తీవ్ర పోటీని దృష్టిలో పెట్టుకుని 4 రోజుల ముందుకు రిలీజ్‌ను ప్రీపోన్ చేశారు. ఈ సినిమా 1960ల నేపథ్యంలో పొలిటికల్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. రవి మోహన్ (జయం రవి), అతర్వా మురళి, శ్రీలీల (తమిళ్ డెబ్యూ) కీలక పాత్రల్లో ఉన్నారు. GV ప్రకాష్ మ్యూజిక్, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది.
పాన్-ఇండియా రిలీజ్ ప్లాన్‌లో భాగంగా తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అయితే.. తెలుగు బాక్సాఫీస్‌లో సంక్రాంతి 2026 భీకర పోటీని గమనించి, తెలుగు వెర్షన్ రిలీజ్‌ను వాయిదా వేయాలని పునరాలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. జనవరి 10న తమిళ్ వెర్షన్ రిలీజ్ అయినా, తెలుగులో రిపబ్లిక్ డే వీకెండ్‌కు రిలీజ్ ను షిఫ్ట్ చేసే అవకాశం ఉందట. ఇలా థియేటర్లు, స్క్రీన్ షేర్ పరంగా మంచి అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
జనవరి 10 లేదా దాని సమీపంలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తే స్క్రీన్లు, ఆడియన్స్ షేర్ పరంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకే మేకర్స్ ఈ నిర్ణయంపై ఆలోచిస్తున్నారు. ఇది వాస్తవంగా జరిగితే ఖచ్చితంగా వారికి మంచి స్ట్రాటజీ అవుతుంది. తెలుగులో రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారా లేదా అన్నదానిపై క్లారిటీ రావలసి ఉంది.






