- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శేఖర్ కమ్ముల తర్వాతి ప్రాజెక్ట్ ఇదే.. ఏకంగా ఆ హీరోయిన్ తోనే !
టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన సినిమాలు దాదాపు హిట్

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన సినిమాలు దాదాపు హిట్ అవుతాయి. మినిమం గ్యారంటీ హిట్ ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. అయితే అలాంటి శేఖర్ కమ్ముల తాజాగా కుబేర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, హీరో ధనుష్ అలాగే రష్మిక ముగ్గురు కీలక పాత్రలో కనిపిస్తారు.
హీరో ధనుష్ బిచ్చగాడి పాత్రలో కనిపించగా... నాగార్జున అలాగే రష్మిక ప్రత్యేక పాత్రలో మెరుస్తారు. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో... శేఖర్ కమ్ముల చేయబోయే తర్వాతే సినిమాపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.. ఇలాంటి నేపథ్యంలోనే కొత్త న్యూస్ తెరపైకి వచ్చింది.
హీరోయిన్ సమంతతో శేఖర్ కమ్ముల కొత్త సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతో సినిమా చేయాలని మొదటి నుంచి శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నారట. లేడీ ఓరియంటెడ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుందని చెబుతున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.






