శేఖర్ కమ్ముల గొప్ప మనసు.. కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోయిందని ఏడ్చిన తండ్రి.. తట్టుకోలేక లక్షలు పంపించిన డైరెక్టర్

by Sujitha Rachapalli |

శేఖర్ కమ్ముల సింప్లిసటీ గురించి ధనుష్, నాగార్జున, నాగచైతన్య లాంటి హీరోలు ఇంటర్వ్యూలు పెట్టి మరీ చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం సింపుల్‌గా అలాగే చూస్తున్నాడు. లవ్ స్టోరీ టైమ్‌లో శేఖర్ కమ్ములతో జర్నీ తనను పూర్తిగా మార్చేసిందని..

శేఖర్ కమ్ముల గొప్ప మనసు.. కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బు కాలిపోయిందని ఏడ్చిన తండ్రి.. తట్టుకోలేక లక్షలు పంపించిన డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్ : శేఖర్ కమ్ముల సింప్లిసటీ గురించి ధనుష్, నాగార్జున, నాగచైతన్య లాంటి హీరోలు ఇంటర్వ్యూలు పెట్టి మరీ చెప్తున్నారు. కానీ ఇవన్నీ విన్న ఆయన మాత్రం సింపుల్‌గా అలా చూస్తు నవ్వేస్తున్నాడు. లవ్ స్టోరీ టైమ్‌లో శేఖర్ కమ్ములతో జర్నీ తనను పూర్తిగా మార్చేసిందని.. అనవసర ఖర్చుల నుంచి దూరంగా ఉంటున్నానని.. దాని వల్ల కొన్ని లక్షలు సేవ్ అవుతున్నాయని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు చైతు. నాగ్ కూడా ఇంత మంచి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని చెప్పుకొచ్చాడు. నిజమే వీరు చెప్పినట్లే శేఖరు కమ్ముల గొప్పోడే మరి. ఇందుకు ఓ ఉదాహరణ ఈ సంఘటన.

కూతురుకు పెళ్లి చేయాలని దాచుకున్న డబ్బు కాలిపోయిందని ఓ తండ్రి ఏడుస్తుండటం చూసిన డైరెక్టర్ తట్టుకోలేకపోయాడట. వెంటనే ఆ తండ్రికి కావాల్సిన రెండు లక్షలు పంపించాడట. దీంతో ఆ అమ్మాయి కూతురు యథావిధిగా జరిగిపోయింది. ఆ తండ్రి మనసు కుదుటపడింది. ఇంతటి మంచి మనసు ఎవరికి ఉంటుంది చెప్పండి. కోట్లు సంపాదించినోళ్లు కూడా రూపాయి బయటకు తీయాలంటే వెనుకా ముందు ఆలోచించే ఈ రోజుల్లో ఇలాంటి మంచి వ్యక్తులు ఉండటం నిజంగా గొప్ప విషయమే. కాగా ఆయన కోసమైనా కుబేర హిట్ కావాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.

Next Story