- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ సీనియర్ హీరో తో శేఖర్ కమ్ముల కొత్త సినిమా..?
అక్కినేని నాగార్జున ( Nagarjuna), హీరో ధనుష్, రష్మిక ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర (Kuberaa). రెండు

దిశ, వెబ్ డెస్క్ : అక్కినేని నాగార్జున ( Nagarjuna), హీరో ధనుష్, రష్మిక ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర (Kuberaa). రెండు రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా... మంచి హిట్ అనుకుంది. కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాను చాలా గ్రాండ్ గా శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. మినిమం గ్యారంటీ సినిమాలు చేసే శేఖర్ కమ్ముల... ఈ సినిమాతో మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాడు.
కుబేర సినిమా హిట్ కావడంతో... శేఖర్ కమ్ములతో ( Shekhar Kammula) సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఎగబడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఆ స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నట్లు... వెల్లడించారు. కుబేర సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... అక్కినేని నాగార్జున తో మరో సినిమా చేయాలని తనకు చాలా ఆసక్తిగా ఉందని వివరించారు.
నాగార్జున ఇంత ఓపెన్ గా ఉంటాడని తనకు ఇప్పటివరకు తెలియలేదు అన్నారు. కుబేర సినిమా సమయంలో.. నాగార్జునతో బంధం పెరిగిందని వివరించారు. చేస్తే అలాంటి వాడితోనే సినిమా చేయాలంటూ.. శేఖర్ కమ్ముల వెల్లడించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అయితే.. ఒక్క నాగార్జునతోనే సినిమా చేస్తారా..? కుబేర తరహాలో మల్టీస్టారర్ తీస్తారా? అనేది చూడాలి.






