ఈ సమ్మర్ మరింత చల్లగా ఉండబోతుంది.. రీ రిలీజ్‌కు సిద్ధమైన బ్యూటీఫుల్ మూవీ

by Chukka Sudharani |   (  Updated:2025-02-04 12:25:00  IST  )

ప్రజెంట్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ (Movies Rerelease) ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల బర్త్‌డే స్పెషల్‌గా వాళ్లు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు మేకర్స్.

ఈ సమ్మర్ మరింత చల్లగా ఉండబోతుంది.. రీ రిలీజ్‌కు సిద్ధమైన బ్యూటీఫుల్ మూవీ
X

దిశ, సినిమా: ప్రజెంట్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ (Movies Rerelease) ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల బర్త్‌డే స్పెషల్‌గా వాళ్లు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు మేకర్స్. అంతే కాకుండా అప్పుడు థియేటర్‌లో హిట్ కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా మళ్లీ రీ రిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీఫుల్ అండ్ కూల్ మూవీ రీ రిలీజ్‌కు సిద్ధం అయింది. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్‌గా తిరుగులేని పేరుతో పాటు ఎన్నో సక్సెస్‌లు అందుకున్న శేఖర్ కమ్ముల(Shekhar Kammula).. అందించిన అందమైన, అద్భుతమైన చిత్రం ‘గోదావరి’(Godavari movie). సుమంత్ (Sumanth), కమలిని ముఖర్జీ (Kamalini Mukherjee) జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఎంతో మంది యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుని క్లాసిక్ హిట్‌గా నిలిచింది.

ప్రేక్షకులకు కథ అర్థమయ్యే విధంగా ఎటువంటి హడావిడీ లేకుండా, హాయిగా సాగేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించి మెస్మరైజ్ చేశాడు శేఖర్ కమ్ముల. అలాంటి ఈ కల్ట్ క్లాసిక్ బొమ్మ ‘గోదావరి’ ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన ‘గోదావరి’ చిత్రం రీ రిలీజ్ కాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతుండగా.. ఇది కదా అసలైన రీ రిలీజ్ అంటే.. ఈ వేసవి చల్లగా ఉండబోతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా.. ఈ సినిమాకు ఏకంగా 5 నంది అవార్డులు, ఒక ఫిలిమ్ ఫేర్ అవార్డు దక్కడం విశేషం.


Click Here For Tweet..

Next Story