- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి మృతి.. కారణమిదే..!!
కాంటా లాగా గర్ల్ షెఫాలీ జరీవాలా మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆమె గుండెపోటుతో చనిపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చేరేలోగానే మరణించిన ఆమె అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు.

దిశ, వెబ్‌సైట్ : కాంటా లాగా గర్ల్ షెఫాలీ జరీవాలా మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆమె గుండెపోటుతో చనిపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చేరేలోగానే మరణించిన ఆమె అంత్యక్రియలకు భారీగా తరలివచ్చారు. అయితే వ్యాయామం, యోగా, పర్ఫెక్ట్ డైట్ మెయింటెన్ చేసే షెఫాలీ మరణానికి అసలు కారణం ఇదేనని అనుమానిస్తున్నారు వైద్యులు. ఆరేళ్లుగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె.. ప్రతి రోజు ఇందుకు సంబంధించిన మెడిసిన్ తీసుకుంటుందని.. ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తోనే గుండెపోటు వచ్చి ఉంటుందని తెలిపారు. ఈ చికిత్సలో వినియోగించే గ్లూటాథియోన్ గుండె సమస్యలకు దోహదపడవచ్చని ఒక న్యూరాలజిస్ట్ సూచించారు. ఇక15 ఏళ్ల వయసు నుంచి జెరీవాలాకు మూర్ఛవ్యాధి (ఎపిలెప్సీ) ఉంది. ఇది కొన్ని సందర్భాల్లో ఆకస్మిక మరణానికి కారణం కావచ్చని చెప్తున్నారు వైద్యులు.
ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫోరెన్సిక్ నివేదిక, పోస్ట్‌మార్టం పరీక్ష ఫలితాలు వస్తేనే అసలు నిజం బయటపడుతుంది. పోలీసులు ఈ కేసును అనుమానాస్పదంగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త పరాగ్ త్యాగి, ఇంటి సిబ్బంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు. కాగా బిగ్ బాస్ 13తో మరింత పాపులారిటీ దక్కించుకున్న షెఫాలీ.. మోడల్‌గా, నటిగా సత్తా చాటింది. రీసెంట్‌గా 75 ఏళ్ల వయసున్న తన తండ్రికి హార్ట్ సర్జరీ చేయించిన ఆమె.. ‘నాన్న నీ ఏజ్ జస్ట్ 75.. నువ్వు నీ లైఫ్‌ను ఫుల్ టు ఎంజాయ్ చేయాలి’ అని చెప్పిందట. ఇలాంటి అమ్మాయి 40ఏళ్లలోనే చనిపోవడాన్ని ఇండస్ట్రీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ తట్టుకోలేకపోతుంది.






