- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రైతే చాలు బెడ్‌పై ఆమెకు అదే పని.. సిల్క్ స్మిత పై డిస్కో శాంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అలనాటి స్టార్ యాక్టర్, దివంగత నటి సిల్క్ స్మిత(Silk Smitha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ యాక్టర్, దివంగత నటి సిల్క్ స్మిత(Silk Smitha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ భామకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆడి పాడి మెప్పించింది. కొన్ని సినిమాలు ఆమె వల్లే హిట్ అయ్యాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి సిల్క్ స్మిత గురించి, రీసెంటుగా ఓ ఇంటర్వ్యూలో స్టార్ యాక్టర్ శ్రీహరి భార్య, నటి, డ్యాన్సర్ డిస్కో శాంతి(Disco Shanthi) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. “స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది.
చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ముంబైలో ఉన్న నేను షాక్ అయ్యాను. తన భర్త గురించి .. ఆ భర్తకు ఆల్రెడీ ఉన్న పిల్లలను గురించి నాతో చెబుతూ ఉండేది. నా దగ్గర ఏ విషయాలు దాచేది కాదు. అప్పట్లోనే స్మిత లక్షల్లో పారితోషికం తీసుకునేది. ఒక రోజుకి ఒక లక్ష నుంచి మూడు లక్షల వరకు తీసుకునేది. మేము ఆ స్థాయికి చేరుకోవడానికి పదేళ్లు పట్టింది. స్మిత నెలకు ఐదు లక్షలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉండేది.
సొంత ఇల్లే కొనుక్కోవచ్చు కదా అనే దానిని. నిజానికి ఆమెది చాలా విలాసవంతమైన జీవితం. అయితే ఒకసారి స్మిత తన సంపాదన గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఆమె సంపాదించిన డబ్బును రాత్రి సమయంలో బెడ్‌పై పరిచి, కరెన్సీ నోట్లపై పడుకునేదట. ఈ మాటను స్వయంగా స్మితా చెప్పింది” అని చెప్పుకొచ్చింది డిస్కో శాంతి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






