శాశ్వత్ సచ్‌దేవ్‌కు టాలీవుడ్‌లో పెరుగుతున్న డిమాండ్

by Pulgam srinivas |

‘ది ఇండియా హౌస్’, ‘బ్లడీ రోమియో’ చిత్రాలతో పాటు రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాకి కూడా శాశ్వత్ సచ్‌దేవ్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

శాశ్వత్ సచ్‌దేవ్‌కు టాలీవుడ్‌లో పెరుగుతున్న డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లలో శాశ్వత్ సచ్‌దేవ్ ఒకరు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ చిత్రానికి ఈయన అందించిన సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కంటే ముందు వరకు శాశ్వత్ సచ్‌దేవ్‌కు ఈ స్థాయి క్రేజ్ లేకపోయినా, ఈ చిత్రం అద్భుత విజయాన్ని సాధించడం, ముఖ్యంగా ఇందులోని పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు భారీ స్థాయిలో ప్రశంసలు రావడంతో ఒక్కసారిగా ఈయన పేరు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ‘ధురంధర్’ విజయంతో ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్‌కు మంచి గుర్తింపు రావడంతో తెలుగు సినిమా ఫిలిం మేకర్స్ కూడా ఈయనతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే యువ నటుడు నిఖిల్ హీరోగా రూపొందనున్న ‘ది ఇండియా హౌస్’ సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శాశ్వత్ సచ్‌దేవ్ పేరు ఖరారైంది. ఇక నేచురల్ స్టార్ నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ చిత్రానికి, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ప్రతిష్టాత్మక చిత్రానికి కూడా ఈయనను సంగీత దర్శకుడిగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకే ఒక్క సినిమాతో భారీ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న శాశ్వత్ సచ్‌దేవ్‌కు ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.

Next Story